మా ఊరు గౌతమీనగర్ ,అశ్వాపురం,ఖమ్మం జిల్లా, ఆంద్రప్రదేశ్. పేరు వినే ఉంటారు.నాది సొంత డబ్బా అని మీరు అనుకోకపోతే, మా టౌన్ ప్రత్యేకతలు ఈ బ్లాగ్ ద్వారా మీకు చెప్పాలని పిస్తోంది. చెప్పాక మీరే అంటారు నిజంగా ఇది చాలా ప్రత్యేకమైనదే అని. భారజల కర్మాగారం ,భారత అణుశక్తి విభాగం ఈ పేరు కూడా వినే ఉంటారు.
.ఖమ్మం నుండి భద్రాచలం వెళ్ళే రూట్లోనే సరిగ్గా , మరో 11కి.మి.కి భద్రాచలం సమీపిస్తుందనగా మణుగూరు క్రాస్ రోడ్ ఒస్తుంది. అక్కడి నుండి 18 కి.మి. దూరంలో అశ్వాపురం ఉంది. అశ్వాపురం మొదట్లోనే మా కాలనీ స్వాగతం పలుకుతుంది. మా భారజల కర్మాగారం ఇక్కడే, మా టౌన్ నుండి 6 కి.మీ. దూరంలో ఉంది. నేనూ ఇక్కడ ఉద్యోగినే.
ఇదేనా , ఇదే మంత గొప్ప ,ఇట్లాంటివీ చాలానే చూశాం ! అనిమీరు అనొచ్చు.
కానీ ఈ పార్కుకు ఎల్లవేలలా ప్రతి రోజూ ప్రతి పూటా, పర్యవేక్షణ ఉంటుంది. అదీ విషయం.
ఇది దాటి ముందుకు వెలితే ఓ చక్కటి షాపింగ్ కాంప్లెక్సు, నీట్ గా అనీ సర్దిపెట్టినట్టుగా ముచ్చటగా ఉంటుంది. పక్కనే షటిల్ కోర్టు, వాలీబాల్ కోర్టు క్రీడా మైదానాలు మిమ్మలను అలరిస్తాయి.
వీటి పక్కనే రిక్రియేషన్ సెంటర్ . ఇందులో మినీ ఇన్నర్ హాల్, జిమ్ సెంటర్స్( స్త్రీ, పురుషులకు వేర్వేరుగా) ,పూల్ గేమ్స్ కాబిన్స్ ఉనాయి.
వ్యూ చూసారుగా! ఎలా ఉంది?
దీన్ని ఆనుకొని లేదా కాలనీకి సరిగ్గా మద్యలో వాటర్ పాండ్ ఉంది . ఇదీ ప్రత్యేకమే. సాయంత్రం అయితే ఇక్కడున్న వాటర్ ఫౌంటెన్ రంగురంగుల నీళ్ళను విరజిమ్ముతూ చక్కని సాయంకాలపు అహ్లాదాన్ని పంచుతుంది. పాండ్ మద్యలోకి కూడా అనుమతిస్తారు.
♪ ఫోటొ లో కనబడుతోంది కదా ! ఆ బ్రిడ్జ్ ద్వారా మద్యలోకి వెళ్ళవచ్చు.
కలర్ వాటర్ ఫౌంటెన్ ను దగ్గరనుండి చూడవచ్చు.
పైన చెప్పిన షాపింగ్ కాంప్లెక్స్ దాటితే ఆటామిక్ ప్రైమరీ పబ్లిక్ స్కూలు, దాని ప్రక్కనే జిల్లాలోనే పేరు పొందిన క్రికెట్ గ్రౌండు.
♣ఈ గ్రౌండ్ జిల్లా లోనే పేరు పొందిన క్రికెట్ గ్రౌండు.♣
రాత్రి వేళల్లో కొలను అందాలు ఎలా ఉంటయో మీరే చూడండి !
♫ ఇక రోడ్లు , నీట్ గా , ఒక్క చిన్న చెత్త కాగితంకూడా లేకుండా ముచ్చటగా ఎలా ఉన్నయో మీరే చూడండి.
విదేశాల్లో రోడ్లు గుర్తుకొస్తున్నాయి కదా మీకు !

♫ ఎప్పటికప్పుడు రోడ్లను నీట్ గా మెయింటెన్ చేస్తారు. వీటికై ప్రత్యేక సిబ్బంది ఉంటారు. వాకింగ్ కోసం చక్కటి పేవ్ మెంట్స్ ఉన్నాయి.
♣ మరో విషయం. మా కాలనీ కార్ల , టూ వీలర్స్ ల సెకండ్ హాండ్ సేల్స్ కోసం బయటవాళ్ళు ఎగబడతారు , అంటే మీరు అర్ధం చేసుకోవచ్చు ఇక్కడి రోడ్ల నాణ్యతను.
♪ ఇదేమో తరంగిణి ఫంక్షన్ హాలు. టౌన్ అన్ని రకాల వేడుకలకు ఇది నిలయం.
ఇది వేణుగోపాల స్వామి ఆలయం లేదా ఇంకా ఆలయ సముదాయం అనొచ్చు. ఇంకా మరెన్నో విషేశాలు !ఇక్కడి అందాలు ఇక్కడి వాళ్ళకంటే బయట వాళ్ళే బాగా చెప్పుకుంటారు. మరెన్నో ప్రత్యేకతలు. దేశం లోని అన్ని రాష్టాలనుండి ఉద్యోగులు ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ అన్ని రకాల పండుగలు జరుగుతాయి. జగన్నాధ రధయాత్ర, శ్రీ క్రిష్ణ జయంతికి క్రిష్ణార్చన, బతుకమ్మ వేడుకలు చాలా బాగా జరుపుతారు.
ఇంకా వసతులు అద్బుతం. 24గంటలూ ట్రీట్ మెంట్ చేయబడ్డ గోదావరి వాటర్ సప్లై, అన్ని వేళలా హాస్పిటల్ సధుపాయం, నిరంతర విద్యుత్తు(ప్రత్యేక కాపిటివ్ పవర్ ప్లాంటు, కర్మాగారం+కాలనీ అవసరాల కోసం).పవర్ కట్ అంటే ఇక్కడ ఎవరికీ పెద్దగా తెలీదు. సంవత్సరకాలంలో కొన్ని గంటలు మాత్రమే ,అదీ ఏదైనా రిపేరు ఉంటేనే కరెంటు తీయవచ్చు. ఆ సమయాల్లో జెనరేటర్ వాడతారు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ సేవా సధుపాయాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
►విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్నఫుట్ బాల్ మైదానం సుందర దృశ్యం చూడండి.
♣ప్రత్యేక సెక్యూరిటీ వ్యవస్త ఎప్పుడూ అలర్టుగా ఉంటుంది. సరైన వ్యక్తిగత నిరూపణ లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించరు.
♣ కాలనీకి చెందిన అన్ని వాహనాలకు ప్రత్యేక ముద్ర ఉంటుంది. కాబట్టి దొంగతనాల టాపిక్కే ఉండదిక్కడ.
♣ పర్యావరణ పరిరక్షణలో బాగంగా ఇక్కడ ప్లాస్టిక్ బ్యాగులు ఎవరూ వాడరు. లోపల ఉన్న చెట్లను నరకడానికి ఇక్కడ ఉండే ఎవరికీ కూడా హక్కు లేదు. ఎవరైనా పొరపాటున చెట్లు నరికితే ఫైన్ విధిస్తారు.
♣ బహిరంగ దూమపానం, మద్యపానం ఇక్కడ నిషిద్దం.
♣ అన్ని రకాల సంసృతులతో, అచారాలతో మా కాలనీ ఒక చిన్న మోడల్ భారతదేశం ను తలపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదేమో అనిపిస్తుంది.
నా ఈ బ్లాగును చూసాక మీ అభిప్రాయాలను, సలహాలను కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. సరిదిద్దుకుంటాను.మీ సోయం రమేష్.




.jpg)




